SRD: మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లారెడ్డి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజన్‌తో మంటలు చల్లార్చిన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు సామాగ్రి అంతా మంటల్లో కలిపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. కుటుంబీకులు కట్టుబట్టలతో బయట వచ్చారు. ఆదుకోవాలని బాధితులు కోరారు.