AP: బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీ జరిగిన రూ. 7.5 కోట్ల నగదును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.