BDK: పినపాక మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ జీపీఎస్ పాఠశాలను ఐటీడీఏ పీవో రాహుల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్‌బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకొని పిల్లలకు తెలుగు, ఇంగ్లీషులో రాసే పదాలు తప్పులు లేకుండా అర్థమయ్యే రీతిలో బోదించాలన్నారు.