GNTR: తెనాలి రైల్వేస్టేషన్ రోడ్లోని పలు సెలూన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సందర్శించారు. అక్కడ నాయి బ్రాహ్మణులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్నికలలో ఇచ్చి హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సెలూన్ షాపులకు 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే విధంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.