AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మూడోరోజు పర్యటించారు. శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొని.. స్థానిక ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.