ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ప్రత్యేక నవజాత శిశువు సంరక్షణ సెంటర్ను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆర్టీవో శ్రీనివాసులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవజాత శిశు మరణాల రేటు తగ్గించడానికి వైద్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. తల్లి ఆరోగ్యంతోపాటు పసికందు ప్రాణాలు నిలబెట్టేందుకు ఈ నవజాత శిశు కేంద్రం ప్రారంభించమన్నారు.