Bandla Ganesh: త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్!
బండ్ల గణేష్ అంటేనే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. బండ్లన్న ఏం మాట్లాడిన సెన్సేషనే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండ్లన్న ఇచ్చే స్పీచ్, సోషల్ మీడియా ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఈ మధ్య బండ్లన్న కాస్త సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం ఇండైరెక్ట్‌గా గురూజీనే అని బల్లగుద్ది మరి చెబుతున్నాడు బండ్లన్న. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
Bandla Ganesh: టాలీవుడ్ గురూజీ అంటే అర్ధం కానీ వారు, తెలియని వారు ఉండరు. అంతంత సినిమా నాలెడ్జ్ ఉన్న వారిని ఎవరిని అడిగినా సరే.. గురూజీ అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని ఠక్కున చెప్పేస్తారు. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ పై సందర్భం వచ్చినప్పుడల్లా ఫైర్ అవుతునే ఉన్నాడు బండ్ల గణేష్ (Bandla Ganesh). ఆ మధ్య భీమ్లా నాయక్ ఈవెంట్‌కు తనను రానివ్వకుండా చేశాడని.. త్రివిక్రమ్‌ను తిట్టినా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయినా ఆ వాయిస్ తనది కాదని కవర్ చేశాడు బండ్లన్న. అయితే తాజాగా మరోసారి ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్‌ని (Bandla Ganesh) ఓ అభిమాని.. అన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని అడిగాడు. దానికి బండ్ల గణేష్ Meet Guruji & give costly gift it will happen.. అంటూ రిప్లే ఇచ్చాడు. అంటే గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ప్రొడ్యూసర్ అయ్యిపోవచ్చని చెప్పాడు బండ్లన్న. మరో షాకింగ్ ట్వీట్ చేశాడు. గురూజీ కి కథ చెపితే Screenplay రాసి.. దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి.. అనుకున్న కథను shed పంపిస్తాడు అని talk ఉంది.
మరో నెటిజన్ ట్వీట్‌కు రిప్లే ఇస్తూ.. ‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే.. అది మన గురూజీ స్పెషాలిటీ.. అంటూ రాసుకొచ్చాడు. దీనిపై ట్విట్టర్లో ఒక రేంజ్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు త్రివిక్రమ్, బండ్ల మధ్య ఉన్న వైరం ఏంటనేది తెలియదు గానీ.. ఈ ఇండైరెక్ట్ వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.