సత్యసాయి శతజయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ‘శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందదాయకం. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. బాబా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.100 స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపు జారీ చేసినందుకు కేంద్రానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేశారు.