SRD: సంగారెడ్డిలోని యోగా భవన్లో హోమ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ యోగా భవనం కోసం అప్పటి మంత్రి హరీష్ రావు రూ.70 లక్షల మంజూరు చేయించినట్లు చెప్పారు.