తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ కి నచ్చిన రాజ్యాంగమే అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కేసిఆర్ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని అన్నారు.
మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె చుట్ట, బీడీ అని ఏనాడు వైఎస్సార్ అనలేదని అన్నారు. ఇక తనకు కాల్ చేసి పరామర్శించినందుకు మోడీ జీకి థాంక్యూ అంటూ ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం నిలబడే పార్టీలు ఉండకూడదని రాసుకున్నారని, ప్రజల కోసం ఎవరైనా నిలబడితే నల్లిని నలిపేసినట్టు నలిపేయాలి అని రాసుందని అన్నారు.
కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం ఎవరైనా పోరాడితే వాళ్లను కాలు బయట పెట్టనివ్వకూడదు అని రాసి ఉందని, కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం నిలబడే వాళ్ల ప్రాణాలకు విలువ లేదు , వాళ్లను బలి తీసుకోవాలి అని రాసి ఉందని అన్నారు. ప్రజల కోసం నిలబడి పోరాడుతుంది ఒక మహిళ అయినా బట్టలు చింపి అవమానించాలి అని రాసి ఉందని విమర్శించారు.
కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం పోరాడేవాల్లపై పెట్రోల్ దాడులు చేయాలి, వాళ్ల వాహనాలు ధ్వంసం చేయాలి అని , బలవంతంగా అరెస్ట్ చేయాలని రాసిందని, పోలీసులను కార్యకర్తలగా వాడుకోవాలని రాసి ఉందన్నారు. ఇక మోడీ తనకు ఫోన్ చేసిన అంశం మీద ఆమె మాట్లాడుతో ఒక మోదీ మాత్రమే కాదు ఎంతో మంది ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి, సపోర్ట్ వ్యక్తం చేశారని, స్పందించకుండా కూడా బాధపడ్డ వారు ఎంతో మంది ఉన్నారు. అందరికీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటోందని అన్నారు.