రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ వారణాసి. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. ఈ సినిమాని ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ (ఐమ్యాక్స్ కోసం)లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీతో సినిమా మొత్తం ఫుల్ స్క్రీన్‌లో కనిపిస్తుందని తెలిపారు. కాగా ఈ చిత్రం 2027 సమ్మర్ సీజన్లో విడుదల కానుంది.