TG: కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన HYD షూటర్ ఈషాసింగ్ను CM రేవంత్ రెడ్డి అభినందించారు. మహిళల 25 మీ. ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని, ఆమె కృషి ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని CM కొనియాడారు. ఈషాసింగ్కు భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.