కరీంనగర్ జిల్లా హుజారాబాద్ మండలం కందుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం శ్రీ భగవాన్ దాస్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెడ్మాస్టర్ సంజీవ రెడ్డి ముండా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.