NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శుభ్రత ఆరోగ్యం పై పలు సూచనలు చేశారు. అనంతరం చెత్తబుట్టలను పంపిణీ చేసి చెట్లను నాటారు.