KRNL: తమ సొంత పొలంలో వేసిన శనగ పంటను రాత్రికి రాత్రే ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉప్పర పూర్ణచంద్ర ఇవాళ డిమాండ్ చేశారు. ‘అన్నదమ్ముల భాగాల్లో వచ్చిన 1.53 ఎకరాల్లో 53 సెంట్లకు రెవెన్యూ అధికారులు 145 సెక్షన్ విధించారు. 53 సెంట్లను వదిలి ఎకరాలో సాగుచేసిన పంటను ఉప్పర శివన్న, ఈరన్న, లక్ష్మీకాంత్ ట్రాక్టర్‌తో దున్నేశారు’ అని రైతు వాపోయారు.