కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఈవో చక్రధరరావు పరిశీలించారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంపులో భక్తులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శనివారం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.