GNTR: రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సీఐఐ సదస్సులో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సదస్సు తొలి రోజులోనే సుమారు రూ.32 వేల కోట్ల పెట్టుబడులను CRDA ఆకర్షించింది. మొత్తం ఎనిమిది సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అమరావతి ప్రాంత వాసులు, CRDA వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.