NLR: దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామంలో బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మహేంద్రబాబు మోదీ మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికలు దేశ ప్రజల వైఖరిని తెలియజేశాయని, బీజేపీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మతం, ఈవీఎంలపై నిందలు వేశాయని, ప్రజలు వాటిని తిప్పికొట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని అన్నారు.