జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలో శుక్రవారం సాయంత్రం వీధి కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పెద్దరేవల్లి గ్రామానికి చెందిన కొంగండ్ల శ్రీశైలం తన గొర్రెలను పొలానికి తీసుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.