KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ ఖాజా అనే హోంగార్డు పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. మంత్రాలయానికి చెందిన తిరుమల్ రావు అనే వ్యక్తి రాఘవేంద్ర కూడలిలో శెనెగలు కొని తన మొబైల్‌ను అక్కడే మరిచి వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మొబైల్‌ను చూసి, విచారించి బాధితుడికి అందజేశారు.