HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.