తుంగభద్ర ఆయకట్టు ప్రాంతాల్లో రెండో పంటకు సాగునీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఫిబ్రవరి వరకు నీటిని విడుదల చేసుకుంటూ పోతే గేట్ల బిగింపు పనులకు అడ్డంకిగా మారుతుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 75 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. నిల్వలు 43 టీఎంసీలకు తగ్గగానే గేట్ల బిగింపు పనులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.