ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టినప్పుడు BPA, థాలేట్స్ వంటి హానికర కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. జీర్ణ, శ్వాసకోశ, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.