ADB: ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నేరడిగొండ, భీంపూర్, బేలా, బోథ్, జైనథ్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కిచెన్ షెడ్, ప్రహరీగోడ, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.