BDK: ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూములకు హక్కులు కల్పించాలని, ఆదివాసి గ్రామాల్లో సమగ్ర అభివృద్ధిని కోరుతూ నవంబర్ 17న పాల్వంచలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఇవాళ పిలుపునిచ్చారు. పాల్వంచ పట్టణంలో తెలంగాణ రైతు కూలీ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.