TG: ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ CM KCRపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్ట్ పొడిగించింది. ఆయనతోపాటు హరీష్, SK జోషీ, స్మిత సభర్వాల్‌పై కూడా వచ్చే ఏడాది జనవరి 19 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేసింది. మరో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జనవరి 19కి విచారణను వాయిదా వేసింది.