ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ ఏరియాలోని అడవుల్లో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు సమాచారం.