ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన పుష్ప మూవీ.. ఇప్పుడు రష్యాలోనూ విడుదలకు సిద్దమవుతోంది. ఈ నెల 8న రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు.. మిగతా పుష్ప చిత్ర యూనిట్.. రష్యాలో ప్రమోషన్స్ చేస్తు సందడి చేస్తున్నారు. అంతేకాదు.. పుష్ప-2 పై కూడా క్రేజీ అప్టేట్స్ ఇస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌ను ఇండియాతో పాటు రష్యాలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అలాగే పుష్ప2 షూటింగ్ టైం కూడా దగ్గర పడిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని వినిపిస్తున్నా.. అఫిషీయల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ పుష్ప 2 షూట్‌ను ఈ నెల 26 నుంచి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో బన్నీ పై.. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట. పుష్ప టీమ్ రష్యా నుంచి తిరిగొచ్చిన తర్వాత.. దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవనున్నాయని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ.. లాంటి విలన్లు ఉండగా.. ఓ బాలీవుడ్ విలన్‌ను కూడా రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సజ్జద్ డెలఫ్రూజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. జగపతి బాబు ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పొలిటీషియన్ రోల్లో కనిపించనున్నాడట. ఇదే నిజమైతే.. రోజు రోజుకి పుష్ప విలన్ల లిస్టు పెరుగుతునే ఉందని చెప్పొచ్చు. మరీ పుష్పరాజ్‌తో తలపడే బ్యాచ్‌ని సుకుమార్ ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.