కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సిద్ధరామయ్యకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీకి సమయం ఇవ్వలేదని సమాచారం. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం మధ్య, సీనియర్ నాయకులతో మాట్లాడేందుకు సిద్ధూ కోరిన సమయాన్ని అధిష్ఠానం అవసరం లేదని స్పష్టం చేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈనెల చివర్లో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద మార్పులు వస్తాయనే అంచనాలున్నాయి.