»Chhattisgarh Ministers Adventure Skydive At The Age Of 70 Video Viral On Social Media
Viral Video: 70 ఏళ్ల వయసులో మంత్రి సాహసం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఛత్తీస్గఢ్ ఆరోగ్య మంత్రి(chhattisgarh Minister) టీఎస్ సింగ్దేవో 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్(skydive) చేశారు. ఈ వీడియో చూసిన తన మద్దతుదారులు, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సాహస క్రీడకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయగా...ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
ధైర్యవంతులు, ఉత్సాహవంతులకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపించారు చత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి(chhattisgarh Minister) టీఎస్ సింగ్ దియో. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన తాజాగా స్కైడైవింగ్(skydive) చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్(viral)గా మారింది. తన మంత్రి వర్గ సహచరుడి సాహసక్రీడ చూసి చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ సింగ్ బాఘేల్ కూడా ఆశ్చర్యపోయారు.
ఇటీవల టీఎస్ సింగ్ దియో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఐతే అక్కడ మంత్రికి స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో మంత్రి ఉత్సాహంగా ఈ సాహసానికి క్రీడలో పాల్గొన్నారు. తాను పారాషూట్ సాయంతో విమానంలోంచి దూకుతున్న వీడియోను నెట్టింట్లో కూడా పంచుకున్నారు.
ఆకాశానికి హద్దు లేదు. ఆస్ట్రేలియాలో ఈసారి నాకు స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇదో అద్భుతమైన అనుభవం అని కామెంట్ చేశారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ భాఘేల్ ను కూడా ఈ వీడియో ఆకర్షించింది. భలే మహారాజ్ సాబ్! మీరు అద్భుతం చేశారుగా. శుభాకాంక్షలు! ఇలాగే మీరు ఉత్సాహంతో ముందుకు సాగిపోవాలని ట్వీట్ చేశారు.
ఈ వీడియో చూసిన మరికొంత మంది గ్రేట్, అమెజింగ్, వావ్ అంటూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక్క రోజులోనే 4600కుపైగా లైక్స్ రాగా..దాదాపు నాలుగు లక్షల మందికిపైగా వీక్షించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
I had the incredible opportunity to go skydiving in Australia, and it was truly an extraordinary adventure. It was an exhilarating and immensely enjoyable experience. pic.twitter.com/2OZJUCnStG