ASF: జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని TUWJ (IJU) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఆదివారం కెరమేరిలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందన్నారు.