BHPL: గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను 12 మంది శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయాన్ని మొత్తం తిరిగి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఈ చారిత్రక ఆలయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.