»Kiss Cabins For Rent For Lovers Shock With Police Entry
Kiss cabins: లవర్స్ కోసం అద్దెకు కిస్ క్యాబిన్స్..పోలీసుల ఎంట్రీతో షాక్
బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు.
లవర్స్ ముద్దులు పెట్టుకోవడం కోసం ఓ వ్యక్తి కిస్ క్యాబిన్స్ ఏర్పాటు చేశాడు. అది కూడా మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఛత్రిపుర పోలీస్ స్టేషన్ కి కొంత దూరంలోనే తన క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు. అయితే ఈ పనులు చేయడానికి లవర్స్ దగ్గరి నుంచి ఆ వ్యక్తి గంటకు రూ.99లు వసూలు చేస్తున్నాడు. క్యాబిన్స్ ను అద్దెకు ఇస్తూ జేబులు నింపుకుంటున్నాడు.
తన బ్లూ బాటిల్ కేఫ్ గురించి లవర్స్ కు తెలిసేలా ఓ వీడియోను కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసి చాలా మంది తమ అభ్యంతరాలను తెలిపారు. కేఫ్ పెట్టిన చాలా రోజుల తర్వాత ప్రమోషన్ కోసం ఆ వీడియోను చేశాడు. ఆ వీడియో కాస్తా పోలీసులకు చేరింది. స్థానికులకు కూడా ఆ కేఫ్ గురించి తెలిసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు కిస్ క్యాబిన్ కేఫ్ కు వెళ్లడంతో ఆ యజమాని అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఛత్రిపుర పోలీసులు పరారైన కేఫ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కేఫ్ ను సీజ్ చేశారు. ప్రస్తుతం కిస్ క్యాబిన్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కూడా వ్యాపారం చేస్తారా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.