సత్యసాయి: హిందూపురం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శ్రీ భక్త కనకదాసు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దీపిక శ్రీ భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, వేణురెడ్డి, కురుబకుల బాంధవులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.