VZM: కొత్తవలస పట్టణ శివారు దత్తి గ్రామం వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు వేస్తున్న హెచ్. టీ విద్యుత్ టవర్ పనులను ఆపాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమతో కనీసం చెప్పకుండా పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ అప్పలరాజు, తన సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుత్తేదారుతో మాట్లాడి న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.