Prabhas: హను రాఘవపూడికి ఓకే చెప్పిన ప్రభాస్..అఫీషియల్ అనౌన్స్ మెంటే లేటు
రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్(Pan india star) అయిన ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆయనను డార్లింగ్(Darling) అని ముద్దుగా పిలుచుకుంటారు.
Prabhas:రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్(Pan india star) అయిన ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆయనను డార్లింగ్(Darling) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన 2002లో విడుదల అయిన ‘ఈశ్వర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ(telugu industry)లోకి అడుగు పెట్టారు. ఆ తరువాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరో అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే ఉంటున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో తర్వగా ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్(Aadipurush) సినిమా రానుంది. లోకల్ టు గ్లోబల్ లెవెల్లో భారీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో మరిన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా డార్లింగ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సారి ప్రభాస్ ప్రముఖ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కి ఛాన్స్ ఇవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా సమాచారం. పైగా ఈ చిత్రం పై అఫీషీయల్ అనౌన్సమెంట్ కూడా త్వరలోనే ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి.