»Hero Suryas Tweet On Jallikattu Verdict Goes Viral
Hero suriya: జల్లికట్టు తీర్పుపై హీరో సూర్య ట్వీట్ వైరల్
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు.
సాంప్రదాయ క్రీడలైన జల్లికట్టు(Jallikattu), కంబాల, ఎడ్లబండ్ల పోటీలు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో ద్విసభ్య ధర్మాసనం జల్లికట్టును నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తీర్పును తాజాగా రాజ్యాంగ ధర్మాసనం సవరించింది. జల్లికట్టులో హింస ఉన్నప్పటికీ, జంతువులను హింసించి వినోదం పొందే రక్త క్రీడగా పేర్కొనలేమని కోర్టు తెలిపింది.
జల్లికట్టు తీర్పుపై హీరో సూర్య ట్వీట్:
Happy and proud to note the Hon’ble Supreme Court’s ruling, upholding #Jallikattu that’s integral to our Tamil culture & #Kambala to Kannada culture! Hearty congratulations to both State Governments and respect to all those who fought consistently against the ban.…
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు. తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు(Jallikattu)ను, కన్నడ సంస్కృతిలో అంతర్భాగమైన కంబాలాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.
సంప్రదాయ క్రీడల నిషేధానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న వారందరికీ ఈ సందర్భంగా హీరో సూర్య అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం సూర్య(Hero suriya) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.