GNTR: తెనాలి(M) కొలకలూరుకు చెందిన బీటెక్ విద్యార్థి షేక్ ఖాజావలి(20) కొమ్మమూరు కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఖాజావలి కోసం గాలించగా, ఇవాళ సాయంత్రం అతని మృతదేహం గుడివాడ శివారులో లభ్యమైంది. ఖాజావలి మృతితో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.