Car Collide Lorry:రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గండిపేట (gandipeta) మండలం ఖానాపూర్ (khanapur) వద్ద ఆగి ఉన్న లారీని (lorry) కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు (car) నుజ్జునుజ్జు అయ్యింది. కారులో (car) ఉన్న ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసి ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న వారిని అతికష్టం మీద తీసి.. ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో నలుగురు గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వీరంతా నిజాంపేటకు (nizampeta) చెందినవారని పోలీసులు (police) చెబుతున్నారు. నిజాంపేటకు చెందిన దివ్యకు (divya) పెళ్లి నిశ్చయమైంది. బ్యాచిలర్ పార్టీలో భాగంగా స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్ వెళ్లారు. తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పింది. పోచమ్మ ఆలయం వద్ద నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది.
చదవండి: Telanganaలో ఆర్మీ భారీ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే..?
కారు (car) వేగంగా రావడంతో.. లారీని ఢీ కొని నుజ్జునుజ్జయ్యింది. కారులో బెల్లూన్లు ఓపెన్ అయ్యాయట.. ప్రమాద తీవ్రత దృష్ట్యా.. ముందు సీట్లలో కూర్చున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి. తీవ్రంగా గాయపడటంతో దివ్య (divya), మరో ఇద్దరు ఘటనాస్థలంలోనే చనిపోయారు.
పెళ్లి నిశ్చయమై.. బ్యాచిలర్ పార్టీ చేసుకునే క్రమంలో.. ఉత్సాహంగా ఉన్న వారిని ప్రమాదం కబళించింది. కారులో పెళ్లి కూతురు దివ్య కూడా ఉండటం.. ఆమె మృతిచెందడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.