అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఈ యువతి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. తీరా శవమై కనిపించింది. ఆమె ఓ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
ఇటీవల టెక్సాస్ లో అదృశ్యమైన తెలుగు అమ్మాయి లహరి పతివాడ ఓక్లహామాల్ లో శవమై కన్పించారు. లహరి అదృష్యమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడం వల్ల ఓక్లహామాల్ లో మృతదేహం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ లోని మెక్టిండియన్ ప్రాంతానికి చెందిన లహరి.. ఓవర్ ల్యాండ్ రీజినల్ మెడికల్ సెంటర్ లో పని చేస్తున్నారు. మే12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరిసారిగా లహరి డల్లాస్ శివారులో కారు నడుపుతూ కనిపించారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లహరి ఎలా మృతి చెందారన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆమెను ఎవరైనా చంపారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.