BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో R&B అధికారులు మంగళవారం రహదారిపై పడ్డ గుంతలకు మరమ్మత్తులు చేపట్టారు. బూర్గంపాడు నుంచి సారపాక వరకు గుంతల మయమైన రోడ్లను బాగు చేసే విధంగా ప్రణాళిక చేపట్టిన R&B అధికారులకు వాహనదారులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టంగా గుంతలను పూడ్చాలని స్థానికులు కోరారు.