KRNL: నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద బుధవారం జరగనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. అయితే ఇవాళ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.