ATP: కూటమి ప్రభుత్వం చేతుల్లో జిల్లా రైతన్నలు మరోసారి దగాకు గురైయ్యారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్నారు.