KNR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆ నియోజవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యం అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, కాంగ్రెస్ నాయకులతో కలిసి జూబ్లీహిల్స్లో ప్రచారంలో పాల్గొన్నారు.