SRD: రామచంద్రపురం శ్రీ సాయి నగర్ కాలనీలోని థీమ్ పార్కును అన్ని సౌకర్యాలతో సుందరీకరిస్తున్నట్లు కార్పొరేటర్ పుష్ప నగేష్ అన్నారు. పార్కులో నీటి సమస్య ఉన్నదని వెంటనే బోర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ఇండియన్, వెస్ట్రన్ టాయిలెట్ల ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. గ్రూపుగా కూర్చుని చర్చించుకునే హాల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.