KMR: జిల్లా ఇన్‌ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్‌కు పదోన్నతి లభించింది. ఈ మేరకు నేడు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి RMOగా ఆయన పదోన్నతి పొందారు. గతంలో దోమకొండ Dy. DMHOగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎల్లారెడ్డి Dy. DMHOగా విధులు నిర్వహిస్తూనే ఇన్‌ఛార్జి DMHO పని చేస్తున్నారు.