NTR: వచ్చిన సరుకుకు స్టాక్ రిజిస్టులకు ఏమాత్రం వ్యత్యాసాలు లేకుండా డీలర్లు సరిచూసుకోవాలని తిరువూరు ఆర్డీవో మాధురి ఆదేశించారు. బుధవారం మండలంలోని మేడూరు సివిల్ సప్లై దుకాణాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు నష్టం జరిగే పనులు చేపట్టరాదని డీలర్‌ను ఆదేశించారు.