AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మత్స్యకారులు రాజయ్యపేట గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 52వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మత్స్యకారుల పొట్ట కొట్టవద్దని నినాదాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉపాధిని కోల్పోవడంతో పాటు ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. తమకు జీవనాధారమైన సముద్రాన్ని దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.