NZB: మోస్రా మండలం చింతకుంటలో వృద్ధాశ్రమం నిర్మాణం గొప్ప విషయమని జిల్లా ప్రముఖ గుండె వైద్య నిపుణుడు కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. జీవితపు చివరి అంకంలో తల్లిదండ్రులను కష్టపెట్టొద్దన్నారు.