KMR: ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్ గేట్ వద్ద ఈరోజు పంట పొలాల్లో ఆటో బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి సింగీతం గ్రామానికి గంగాధర్ అనే వ్యక్తి ఆటోలో వస్తుండగా, హ్యాండిల్ లాక్, క్లచ్ పనిచేయకపోవడంతో ఆటో అదుపుతప్పి పొలంలో పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అతని భార్య క్షేమంగా బయటపడ్డారు. పొలాల్లో పనిచేస్తున్న వారు ఈ విషయాన్ని తెలిపారు.